గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి వరుస అప్ డేట్స్ ఇస్తున్న మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో అంజలి లుక్ ఎలా ఉందో రివీల్ చేశారు. ఈ మేరకు అంజలి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో అంజలి లుక్ వైరల్ అవుతోంది.