‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం.. కొత్త దర్శకుడు యుడ్లీతో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘దిల్ రుబా’ అనే టైటిల్ పెట్టారు. ఈ మేరకు ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేశారు. ఈ సినిమాలో రుక్సర్ ఢిల్లోన్ కథానాయికగా నటిస్తుంది. 2025 ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ సమర్పణలో ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ సంస్థ నిర్మిస్తుంది.