కథల ఎంపిక గురించి మలయాళ స్టార్ మోహన్ లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనసుకు చేరువైన కథలను మాత్రమే ఎంచుకుంటున్నట్లు చెప్పారు. ‘మలైకోటై వాలిబన్’ పరాజయం తర్వాత కథల ఎంపికలో తాను మరింత ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, ప్రేక్షకులు మాత్రం దాన్ని ఆదరించలేదని అన్నారు. అది ఫ్లాప్ అయినప్పుడు తనకంటే ఫ్యాన్స్, శ్రేయోభిలాషులే ఎక్కువగా బాధపడ్డారని పేర్కొన్నారు.