నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో భారీ చిత్రం రాబోతున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ‘సరిపోదా శనివారం’తో తన మాస్ యాంగిల్‌ను నిరూపించుకున్న వివేక్, బాలయ్య కోసం ఓ లార్గర్ దెన్ లైఫ్ కథను సిద్ధం చేశాడట. బాలకృష్ణకు ఇప్పటికే కథను కూడా వినిపించారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేసే ఆలోచనలో ఉన్నారట.
హీరోయిన్ తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్నిసార్లు తనతో కలిసి పనిచేయడం కొంచెం కష్టమనే మాట వింటుంటానని తెలిపింది. ‘బహుశా నాతో పనిచేయని వ్యక్తులు ఇలా ప్రచారం చేసి ఉండొచ్చు. నేనేంటో అందరికీ నిరూపించుకోవాలని అనుకోను. అలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా పనితోనే సమాధానం చెప్తా’ అని చెప్పుకొచ్చింది.
T20 ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్‌లో వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం సాధించి సెమీస్‌కు చేరింది. 196 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97* పరుగులతో వీరవిహారం చేశాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సంజూపై మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రశంసలు కురిపించారు. ఇది అద్భుతమైన మాస్టర్‌ఫుల్ ఇన్నింగ్స్ అని, సంజూ ప్రతిభకు ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.
విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం తర్వాత హైదరాబాద్‌లో ఈ నెల 4న గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు కేవలం ఆహ్వానం ఉన్న అతిథులు మాత్రమే హాజరుకావాలని వారు కోరారు. సెక్యూరిటీ, పోలీసుల ఆంక్షల దృష్ట్యా అభిమానులు ఎవరూ రావొద్దని, వచ్చి ఇబ్బంది పడొద్దని విజ్ఞప్తి చేశారు. అభిమానుల క్షేమమే తమకు ముఖ్యమని, వారి దీవెనలు ఎక్కడున్నా తమకు చేరుతాయని ‘విరోష్’ జంట తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రూపొందింది. మార్చి 26, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ దక్కించున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అక్కడ మార్చి 25న ప్రీమియర్లు ప్రదర్శించనున్నట్లు వెల్లడిస్తూ పోస్టర్ షేర్ చేశారు.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో ‘NBK111’ సినిమా రాబోతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి 6 నుంచి ప్రారంభం కానుందట. తాజాగా బాలయ్య లుక్ టెస్ట్ జరిగినట్లు, ఈ మూవీలో సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నట్లు టాక్. తన పాత్ర కోసం ఆయన స్లిమ్‌గా మారి, డిఫరెంట్ గెటప్పులతో అలరించబోతున్నారట. ప్రస్తుతం బాలయ్య తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై ఫోకస్ పెట్టారట.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. 2026 మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. బెంగళూరులో దీని ట్రైలర్ మార్చి 8న విడుదల కానుంది. ఇక ఈ మూవీలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరస్వతి’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ నందమూరి బాలకృష్ణను కలిసి సినిమా విశేషాలను పంచుకున్నారు. బాలయ్య తన ఆశీస్సులు అందిస్తూ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. గతంలో వరలక్ష్మి, బాలయ్య ‘వీరసింహారెడ్డి’లో నటించిన సంగతి తెలిసిందే.
వరలక్ష్మి శరత్ కుమార్ నటించడం ఆమె తండ్రి శరత్ కుమార్‌కు ఇష్టం లేదని రాధికా తెలిపింది. ‘సరస్వతి’ మూవీ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. వరలక్ష్మిని నటిగా తీసుకోవద్దని నిర్మాతలకు కూడా ఆయన చెప్పారని గుర్తు చేసుకుంది. వరలక్ష్మి నటన చూసి ఆమె గొప్ప నటి అవుతుందని చెప్పానని తెలిపింది, అంతేకాదు తెలుగు సినిమాపై దృష్టి పెట్టమని ఆమెకు సలహా ఇచ్చినట్లు పేర్కొంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా USAలో ఏప్రిల్ మొదటి వారంలో గ్రాండ్ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ సక్సెస్ అయితే ‘పెద్ది’ అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారట. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అదరగొడుతోంది. రెండు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.9.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన ఈ మూవీకి రధన్ మ్యూజిక్ అందించాడు.
‘రణబాలి’ చిత్రంలోని విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 1800ల నాటి సహజత్వం, మట్టి వాసన ఉట్టిపడేలా దీన్ని రూపొందించామని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెలిపాడు. ఈ సీన్ వారి నిజ జీవిత వివాహంతో యాదృచ్ఛికంగా సరిపోలిందని, ఇది చూస్తుంటే వారి గత జన్మ పెళ్లి ఫొటోలా అనిపిస్తోందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
‘కపుల్ ఫ్రెండ్లీ’ హిట్‌తో జోరుమీదున్న సంతోష్ శోభన్ వరుసగా 4 మూవీలను లైన్‌లో పెట్టాడట. యూవీ క్రియేషన్స్‌లో లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో ఆయన ‘మల్టీ యూనివర్స్ కామెడీ’ ప్రాజెక్ట్ చేయనున్నాడు. అలాగే రామ్ పసుపులేటితో ఒక ఫాంటసీ అడ్వెంచర్ మూవీకి సిద్ధమయ్యాడు. మరో రెండు క్రేజీ కథలు చర్చల దశలో ఉన్నాయి. విభిన్నమైన కాన్సెప్టులతో అలరించేందుకు సంతోష్ రెడీ అవుతున్నాడు.
పెళ్లిపై నటి త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఒంటరిగా ఉండటానికైనా సిద్ధమే’ అని చెప్పింది. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని విడాకుల వరకు వెళ్లడం ఇష్టం లేదని, జీవితాన్ని పంచుకోగలిగే మంచి భాగస్వామి కోసమే ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కేవలం ప్రేమలో పడటం కంటే, సంతోషకరమైన వైవాహిక జీవితమే తన లక్ష్యమని పేర్కొంది.
ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ‘ఫిల్మ్ సిటీ’కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ దాదాపు 500 ఎకరాల్లో హాలీవుడ్ హంగులతో దీని నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ వస్తే పర్యాటకం, ఉపాధి పెరగడమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ సినిమా షూటింగ్‌లకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.