తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి నటి సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. నాలుగేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో తాను తమిళ అమ్మాయినని చెప్పగా, దానిని వక్రీకరించి మలయాళీలపై తనకు కోపం ఉందని తప్పుడు వార్తలు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను కోయంబత్తూరులో పుట్టానని, మాతృభాషపై మమకారమే తప్ప ఇతర భాషలను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేయడంతో ఈ వివాదానికి తెరపడింది.
అక్కినేని నాగార్జున 100వ చిత్రం ‘కింగ్ 100’ షూటింగ్ ప్రస్తుతం మనాలిలోని మంచు కొండల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇన్నాళ్లూ ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ చిత్ర దర్శకుడు రా.కార్తీక్‌తో కలిసి మనాలి లొకేషన్లలో ఉన్న ఫొటోలను ఐశ్వర్య రాజేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో, ఆమె ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు స్పష్టమైంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో రాబోతున్న మూవీ ‘జైలర్ 2’. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా సెట్స్‌లో కేక్ కట్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK 111’ చిత్రం రాబోతుంది.ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా, తాజాగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార స్థానంలోకి కాజల్ అగర్వాల్ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ ఏ. కరుణాకరన్ దాదాపు 8ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్నాడు. ‘తొలిప్రేమ’, ‘డార్లింగ్’ వంటి క్లాసిక్ లవ్ స్టోరీల తర్వాత, ఆయన తన తదుపరి చిత్రాన్ని యువ హీరో బెల్లంకొండ గణేష్‌తో ప్రకటించాడు. ఈ చిత్రం కరుణాకరన్ మార్క్ సాఫ్ట్ ఎమోషన్స్, క్యూట్ లవ్ స్టోరీతో కూడిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా ఉండనుంది.
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ గౌరవార్థం జరిగిన విందులో ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. అక్కడ ఆయన నటి ప్రియాంక మోహన్, కే-పాప్ స్టార్ ఆరోరాలను కలిసి ముచ్చటించారు. వారితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘మేడ్ ఇన్ కొరియా స్టార్ ప్రియాంకను కలవడం సంతోషం’ అని థరూర్ ట్వీట్ చేశారు. దీనికి స్పందిస్తూ ప్రియాంక ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.
సూర్య ‘కరుప్పు’ మూవీపై మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ భారీ ప్రాజెక్టులో భాగమవ్వడం తనకు ఊహించని అవకాశమని, ఇదొక పెద్ద సర్‌ప్రైజ్ అని అన్నాడు. ఈ మూవీకి సంబంధించిన BGM పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే గ్రాండ్‌గా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించాడు.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. సంక్రాంతి హిట్ అయిన ఈ మూవీ అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. తాజాగా APలోని కడప జిల్లాలో ఉన్న యర్రగుంట్ల, మైదుకూరు సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుని రేర్ ఫీట్ సాధించింది. నేటి కాలంలో వంద రోజుల రన్ అంటే మెగాస్టార్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది.
తమిళ నటుడు, దర్శకుడు ఆర్.పార్తిబన్‌కు ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికెట్‌ను ఏప్రిల్ 29లోపు జారీ చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. గతంలో పొరపాటున కులం పేరు ప్రస్తావించడం వల్ల కలిగిన బాధతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్తిబన్ తెలిపాడు. కుల ప్రాతిపదికన వచ్చే ఎలాంటి ప్రయోజనాలు తనకు వద్దని, కేవలం కష్టాన్ని నమ్ముకుని జీవిస్తానని చెప్పాడు.
షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘కింగ్’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ సెన్సేషనల్ ప్లాన్ చేస్తున్నాడట. ఇంటర్నేషనల్ పాప్ సింగర్ ఎడ్ షీరన్ ఈ ప్రాజెక్టులోకి వస్తున్నట్లు టాక్. గ్లోబల్ టచ్ ఇచ్చేలా అనిరుధ్ ఈ స్పెషల్ కొలాబరేషన్ సెట్ చేస్తున్నట్లు టాక్. 2026 DECలో ‘కింగ్’ విడుదల కానుంది.
జూ.ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాను జూన్ 11, 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఈ మేరకు షేర్ చేసిన మూవీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అలాగే, ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’పై మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ మూవీ మ్యూజిక్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే సాంగ్స్ అవుట్‌పుట్ సిద్ధమైంది. ప్రస్తుతం గ్లోబల్ రైటర్స్, సింగర్స్‌తో కలిసి లిరిక్స్‌పై వర్క్ చేస్తున్నా. బన్నీకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయనతో పని చేయడం కొత్త అనుభూతినిస్తోంది’ అని చెప్పాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ 2027 నాటికి భారీ లైనప్‌ను సిద్ధం చేస్తున్నాడు. తేజ సజ్జాతో రెండు సినిమాలు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అడివి శేష్ ‘గూఢచారి 2’ వచ్చే ఏడాది విడుదల కానుండగా, సన్నీ డియోల్ ‘జాట్ 2’ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో కలిసి మరో మూడు ప్రాజెక్టులను వచ్చే ఏడాది పట్టాలెక్కించనున్నాడు.
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ‘రాజా శివాజీ’. తాజాగా ఈ మూవీలో సల్మాన్ ఖాన్ భాగం కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో సల్మాన్ శివాజీ నమ్మకస్తుడైన పోరాట యోధుడు ‘జీవా మహాలా’ పాత్రను పోషించనున్నాడట. ఇక మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా 2026 మే 1న రిలీజ్ కానుంది.
తమిళ స్టార్ ధనుష్, టాలెంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కాంబోలో సినిమా రాబోతుందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించబోయే తదుపరి చిత్రంలో మృణాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని ఆయన భావిస్తున్నారట. ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్తే వెండితెరపై మ్యాజిక్ ఖాయం. మరోవైపు, ధనుష్ నటించిన తాజా చిత్రం ‘కర’ ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది.