తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి నటి సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. నాలుగేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో తాను తమిళ అమ్మాయినని చెప్పగా, దానిని వక్రీకరించి మలయాళీలపై తనకు కోపం ఉందని తప్పుడు వార్తలు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను కోయంబత్తూరులో పుట్టానని, మాతృభాషపై మమకారమే తప్ప ఇతర భాషలను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేయడంతో ఈ వివాదానికి తెరపడింది.