అల్లు అర్జున్ అరెస్టుపై గంగ్రోతి సినిమా రచయిత చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బన్నీ అరెస్ట్ అమానుషం. అల్లుఅర్జున్‌పై చట్టపరంగా పెట్టిన సెక్షన్లన్నీ తప్పే. ఆయన వెనక పెద్ద కుటుంబం ఉంది. మెగా ఫ్యామిలీ అంటేనే మానవత్వం. అల్లు అర్జున్‌కి మరకలు అంటించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన ఏ నాయకుడు అయినా, ప్రభుత్వమైనా సర్వనాశనం అయిపోతుంది’ అంటూ ఆగ్...
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మరణించిన రేవతికి మరోసారి నివాళి అర్పిస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. ‘రేవతి కుటుంబానికి అండగా ఉంటాం. ఆరోజు ఘటన ప్రమాదవశాత్తు జరిగింది. నేను ప్రస్తుతం బాగానే ఉన్నా. ఎవరూ ఆందోళన చెందవద్దు. లీగల్ విషయాల గురించి ఏమీ మాట్లాడదలచుకోలేదు. నాకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బన్నీతో న్యాయవాదుల బృందం చర్చలు జరిపారు. 45 నిమిషాల పాటు పలు అంశాలపై ఆయనతో లాయర్ నిరంజన్ రెడ్డి చర్చించారు. అనంతరం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి నిరంజన్ రెడ్డి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ కూడా తాజాగా తన నివాసానికి చేరుకున్నారు. భార్య బిడ్డలను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు.
డైరెక్టర్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బచ్చల మల్లి’. ఈ నెల 20న ఇది రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. ఇక హాస్య మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించింది.
పుష్ప-2 సినిమాలో హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంలో ఎస్పీ షెకావత్ విఫలమైనా నిజ జీవితంలో ఓ పోలీస్ మాత్రం సక్సెస్ అయ్యాడు. ఆయన ఎవరు అంటూ నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆ పోలీస్ పేరు బానోత్ రాజు నాయక్. ఆశ్చర్యమైన అంశం ఏంటంటే.. ఆయన బన్నీకి వీరాభిమాని. ఒక్కసారైనా అతడితో ఫొటో దిగాలని భావించాడట. కానీ చివరికి అభిమాన హీరోనే అరెస్ట్ చేసి ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.
సినిమాల్లో మద్యం, డ్రగ్స్‌పై పాటలు ఉండటంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. మూవీల్లో ప్రతి అంశం భావోద్వేగాలకు సంబంధించిందని, ఇలాంటి విషయాలపై చిత్రబృందంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై మాట్లాడుతూ.. ఆయనకు తన పూర్తి మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు.
గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ మామ చంద్రశేఖర్ రెడ్డిని కలిశారు. అనంతరం మామగారి ఇంటికి చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచి అల్లు అర్జున్ భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హ.. చంద్రశేఖర్ ఇంట్లో ఉండటంతో వారిని కలిసేందుకు వెళ్లారు. వాళ్లని కలిసి అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని బన్నీ నివాసానికి వెళ్లనున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశ...
తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో RJ బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ‘సూర్య 45’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ఆఫీస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కాసేపట్లో అల్లు అర్జున్ నివాసానికి వెళ్లనున్నారు. కాగా.. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే. నిన్న అతనికి బెయిల్ మంజూరు కాగా.. ప్రక్రియ ఆలయం కావటంతో ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.
జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తన ఇంటికి బయలుదేరారు. మరికాసేపట్లో ఇంటికి చేరుకోనున్నారు. జైలు బయట ఎక్కువ క్రౌడ్ ఉండడంతో ఆయనను అధికారులు జైలు వెనుక వైపు నుంచి బయటకు పంపించారు. ఆయన వెంట ఎస్కార్ట్ ఇచ్చి ఇంటికి పంపారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను ఏ11గా పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఏ1గా థియేటర్ పార్ట్నర్ రామరెడ్డి, ఏ3గా మరో పార్ట్నర్ సందీప్, ఏ9గా సీనియర్ మేనేజర్ నాగరాజు, ఏ10గా అప్పర్ లోయర్ బాల్కని ఇంఛార్జ్ విజయ్ చంద్రన్‌ను ఉంచారు. ఈ కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చగా.. అందులో 8 మంది పరారీలో ఉన్నారు.
అల్లు అర్జున్ను నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పలువురు సినీ ప్రముఖులు ఐకాన్ స్టార్‌కు బాసటగా నిలిచారు. ‘సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన బాధాకరం. అయినప్పటికీ జరిగిన ఘటనకు ఒక్కరినే బాధ్యులుగా చేయటం సరికాదు.’ అంటూ అల్లు అర్జున్‌కు మద్దతుగా తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
మరో గంటలో చంచల్‌గూడ జైలు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల కానున్నారు. అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఆ ఆర్డర్ కాపీ తమకు అందలేదంటూ ఆయనను జైలు అధికారులు రాత్రంతా జైలులోనే ఉంచారు. అర్థరాత్రి సమయంలో ఐకాన్ స్టార్ తరఫు లాయర్లు ఆ ఆర్డర్ కాపీని అధికారులకు అందించారు. దీంతో ఇవాళ ఉదయం 7 గంటలకు ఐకాన్ స్టార్ జైలు నుంచి విడుదల కానున్నారు.
బెయిల్ ఉత్తర్వుల కాపీ జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో అల్లుఅర్జున్ రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. దీంతో అల్లు అర్జున్ను అండర్ ట్రైల్ ఖైదీగా పరిగణించి ఖైదీ నంబర్ 7697ను ఆయనకు కేటాయించినట్లుగా సమాచారం. అర్జున్ రాత్రంతా జైలులోని మంజీరా బ్యారక్‌లోనే ఉన్నారని.. ఆయనతో పాటు మరో ఇద్దరు విచారణ ఖైదీలు అందులోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇవాళ ఉదయం 7 గంటలకు అల్లు అర్జున్ వ...