‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ‘మహానటి’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టింది. హిందీలో ‘బేబీ జాన్’ సినిమా చేస్తుంది. ఈ మూవీ కోసం కీర్తి డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో రూ.2 కోట్ల మేర పారితోషికం తీసుకునే ఆమె.. ఈ సినిమా కోసం రూ.4 కోట్లకుపైగా రెమ్యూనరేషన్ తీసుకుందట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.