విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.. వెంకటేష్ బర్త్ డే రోజున రెండో పాట ‘మీను’ ప్రోమో విడుదల కాగా.. ఫుల్ పాటను రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా వచ్చే నెల 14న విడుదల కానుంది.