ప్రేమ, భాగస్వామి గురించి నేషనల్ క్రష్ రష్మికా మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒడుదొడుకుల్లో తన వెన్నంటే ఉండే భాగస్వామి కావాలని చెప్పారు. ప్రతి దశలోనూ తోడుండాలని, ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, రష్మిక ఇదివరకే ఓ హీరోతో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు తరచూ వస్తోన్న విషయం తెలిసిందే.