బిట్‌కాయిన్ మోసం కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. ఆయనకు ముంబైలోని PMLA కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారీ స్థాయిలో క్రిప్టో కరెన్సీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ విధంగా తీర్పునిచ్చింది.