హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. ‘SMలో ట్రోల్స్ అనేది చాలా పెద్ద పదం. గతం గురించి ఆలోచించడం నాకు ఇష్టం లేదు. కానీ, ఇది సినీ ఇండస్ట్రీ. ఇక్కడ ఎవరికైనా ఏదైనా జరగొచ్చు. నేను దాని నుంచే చాలా నేర్చుకున్నాను. సహజంగానే ట్రోల్స్ బాధించినా ఎదగడానికి తోడ్పడతాయి. నేను ఇలాంటి ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకుంటాను’ అని వెల్లడించింది.