TG: సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో డివైడర్‌ను ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
TG: హైదరాబాద్‌లోని అప్పా జంక్షన్ దగ్గర కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును నిలిపివేసి బయటకు వచ్చేశాడు. అయితే కారు పూర్తిగా తగలబడింది. ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనతో రహదారిపై భారీగా ట్రాపిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
TG: భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టును హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. దాదాపు రూ.2.29 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 333 కిలోల గంజాయిని సీజ్ చేసి 126 మందిని అరెస్ట్ చేశారు. అలాగే రూ.25.82 లక్షల విలువైన హాష్ ఆయిల్‌ను, రూ.22.5 లక్షల విలువైన ఓపీఎం మిక్స్ పౌడర్‌ను పట్టుకున్నారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో గొడవపడి స్నేహితుడు మధును రాడ్డుతో కొట్టి చంపిన చరణ్, నవీన్.. మృతదేహాన్ని ఇసుక దిబ్బలో పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న చరణ్ తల్లి, కొడుకు అని చూడకుండా పోలీసులకు పట్టించి నిజాయితీ చాటుకుంది. పోలీసులు చరణ్‌ను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు నవీన్ కోసం గాలిస్తున్నారు. కొడుకు హంతకుడిగా మారడంతో తల్లి విలపిస్తోంది.
TG: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లా కొత్తపల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ(16) ఇటీవల జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసింది. అయితే, ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతులు రాజేంద్రప్రసాద్, మారుతిగా గుర్తించారు. అలాగే, విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బల దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ప్రమాదాల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్‌లో దారుణం జరిగింది. నిద్రిస్తున్న అన్న రఘుపై తమ్ముడు అనిల్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తల్లిని ఇంట్లోకి రానివ్వట్లేదని ఆగ్రహానికి గురైన అనిల్, కిటికీలో నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగి తీవ్రగాయాలైన రఘును వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: విశాఖలో ఐటీ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉన్నతి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసి ఉద్యోగాలంటూ లక్షన్నర నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు చేశారు. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
AP: తిరుపతి జిల్లాలోని తాల్వాయిపాడు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం.
AP: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని దగ్గర దారుణం జరిగింది. యువతిపై ఆటో డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే యువతి శక్తి యాప్‌లో ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను కాపాడారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. యువతిని స్వస్థలానికి చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: IPL సీజన్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మందిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాపేటలో 11 మంది, పాత గుంటూరులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. నిందితుల నుంచి మొత్తం రూ.2 లక్షల నగదు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలోని ఓ ఐఫోన్ తయారీ ప్లాంటులో దారుణం చోటుచేసుకుంది. ఆ ప్లాంట్‌లో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ యువతి పసికందు గొంతుకోసి హతమార్చి ఓ సంచిలో పడేసింది. ఆ యువతికి ఇంకా వివాహం కాలేదని.. ఈ విషయం తెలిస్తే పరువు పొతుందేమోనని భయాందోళనతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ATP: తాడిపత్రి రూరల్ పరిధిలోని పేకాట స్థావరంపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. సీఐ శివగంగాధర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 55,440 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
UP మీర్జాపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. డ్రమండ్‌గంజ్ ప్రాంతంలో కంకర లోడు లారీ వేగంగా వచ్చి మారుతీ స్విఫ్ట్‌ను ఢీకొనగా.. అది దాని ముందున్న బొలెరోను గుద్దడంతో మంటలు చేలరేగాయి. దీంతో 11 మంది అక్కడికక్కడే మంటల్లో ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
AP: అనంతపురం హనీట్రాప్ ముఠాకు అనుకూలంగా వ్యవహరించారని ఇద్దరు సీఐలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీఐలు రాజేంద్రనాథ్, శ్రీహర్షను కర్నూలు వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు డీఐజీ వద్ద రిపోర్టు చేయాలని ఇద్దరు సీఐలకు ఆదేశించారు. హనీట్రాప్ ముఠాతో సంబంధాలున్న మరో 10 మందిని శిక్షణ ఎస్పీ అశ్విన్‌కుమార్ విచారిస్తున్నారు.