• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం

ఏపీ, ఒడిశా సరిహద్దులోని మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పవర్‌స్టేషన్‌ షట్‌డౌన్‌ అయిన అనంతరం మంటలు చెలరేగాయి. దీంతో పవర్‌స్టేషన్‌ రెండో అంతస్తులో కార్మికులు చిక్కుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 23, 2026 / 12:38 PM IST

BREAKING: అడ్వకేట్ దారుణ హత్య

TG: HYD మాసబ్ ట్యాంక్ వద్ద గుర్తు తెలియని దుండగులు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వక్ఫ్‌బోర్డు తరఫున పలు కీలక కేసులు వాదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాత కక్షలతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

May 23, 2026 / 12:23 PM IST

BREAKING: భూ వివాదం.. అడ్వకేట్ దారుణ హత్య

TG: HYD మాసబ్ ట్యాంక్ వద్ద గుర్తు తెలియని దుండగులు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వక్ఫ్‌బోర్డు తరఫున పలు కీలక కేసులు వాదించగా.. మలక్‌పేటలోని వక్ఫ్‌బోర్డు భూవివాదాల కారణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం 5 ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాయి.

May 23, 2026 / 12:23 PM IST

దారుణం.. ముక్కలుగా నరికి బస్తాలో కుక్కి

TG: సూర్యాపేట మండలంలో యర్కారంలో రాజకీయ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. చింతలపాటి మధు అనే వ్యక్తి దారుణ హత్య చేశారు. ముక్కలుగా నరికి బస్తాలో కుక్కి పడేశారు. గతంలో జరిగిన ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్న మధును.. ఆ కేసు విచారణ ముగిసే దశలో ఉండటంతోనే హత్య చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్య నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

May 23, 2026 / 11:05 AM IST

విషాదం.. ఆలయ కోనేరులో మృతదేహాలు

AP: జనగామ జిల్లా బండ్లగూడెంలో విషాదం నెలకొంది. స్థానిక శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరులో రెండు మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. మృతులను ఆలయ అర్చకుడు నరసింహాచార్యులు, ఆయన కుమారుడు పవన్‌గా పోలీసులు గుర్తించారు. వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

May 23, 2026 / 09:12 AM IST

దొంగతనం కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష

E.G: రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మొబైల్ దొంగతనం కేసులో ముద్దాయి బోడ చంద్రమౌళికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2023 మే 12న కోటిపల్లి బస్టాండ్ సమీపంలో ఫిర్యాదుదారుడి మొబైల్ ఫోన్ లాక్కొని పరారైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించగా… 5వ అదనపు AJFCM కోర్టు ముద్దాయికి శిక్ష విధించారు.

May 23, 2026 / 06:30 AM IST

అటవీ ప్రాంతంలో వ్యక్తి మృతదేహం లభ్యం

TPT: చిన్నగొట్టిగల్లు (M) పాలమాకులపల్లి అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దుండగులు సదరు వ్యక్తి గొంతు, మర్మాంగం కోసి కిరాతకంగా హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో కత్తి, క్యారియర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితమే ఈ ఘోరం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

May 22, 2026 / 04:20 PM IST

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం

AP: విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. పోర్టు అథారిటీ ట్రక్ పార్కింగ్ టెర్మినల్‌లో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లో ఉన్న లారీ క్యాబిన్‌లో సిలిండర్ పేలింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

May 22, 2026 / 03:07 PM IST

రోడ్డు ప్రమాదం.. డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి

ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి చెందగా.. మిగతావారికి గాయాలయ్యాయి. బస్సులో ఏపీలోని నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

May 22, 2026 / 12:52 PM IST

BREAKING: హీరా స్కామ్.. కీలక నిందితురాలి అరెస్ట్

TG: హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా గుర్గావ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఫేక్ ఆధార్‌తో గుర్గావ్‌లో ఉన్నట్లు గుర్తించామని, నౌహీరాను త్వరలో HYDకి తరలించనున్నట్లు తెలిపారు. కాగా, అధిక లాభాలు ఆశ చూపి రూ. 5,000 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించి పరారైంది. దీంతో ఆమెపై 60కి పైగా కేసులు నమోదయ్యాయి.

May 22, 2026 / 07:50 AM IST

భారీ అగ్నిప్రమాదం

థాయ్‌లాండ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టాయాలోని హోటల్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 22, 2026 / 06:17 AM IST

లారీని ఢీకొట్టిన బస్సు.. తప్పిన ప్రమాదం

NLR: మనుబోలు మండలం కొమ్మలపూడి-కొండూరు సత్రం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి నెల్లూరు బయల్దేరిన ఆర్టీసీ బస్సు, మార్గమధ్యంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

May 21, 2026 / 05:20 PM IST

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

ATP: గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలో గురువారం ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న GRP పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై GRP పోలీసులు కేసు నమోదు చేశారు.

May 21, 2026 / 04:25 PM IST

రైలు కిందపడి ఒకరి ఆత్మహత్య

నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై హరిచందన తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40-45 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతుడు ఎత్తు 5.4 అడుగులు కలిగి, బులుగు రంగు గీతల ఫుల్ హాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆనవాళ్లు లభించలేదని… ఎవరికైనా ఆచూకీ తెలిస్తే స్టేషన్ లో సంప్రదించాలన్నారు.

May 21, 2026 / 03:20 PM IST

కంటైనర్‌లో మంటలు.. 10 కొత్త కార్లు దగ్ధం

TG: మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో కంటైనర్‌లో మంటలు చెలరేగాయి. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంటైనర్‌లో తరలిస్తున్న 10 కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 21, 2026 / 01:52 PM IST