ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి చెందగా.. మిగతావారికి గాయాలయ్యాయి. బస్సులో ఏపీలోని నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది ప్రయాణికులు ఉన్నారు.