ATP: జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాసినేని గ్రాండ్ హోటల్ యజమాని మాసినేని రామయ్య మరణం పట్ల మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామయ్య పార్థివ దేహానికి శుక్రవారం పూలదండ వేసి ఆమె ఘనంగా నివాళులర్పించారు. పార్టీ సీనియర్ నాయకుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని ఆమె పేర్కొన్నారు.