PLD: మాచర్లలోని చెన్నకేశవ కాలనీలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ బీ.కృష్ణారావు ఆదేశాలతో గురజాల డీఎస్పీ ఎం.మహేశ్వరావు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్, నాటుసారా, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.