సీఎంఆర్ బియ్యం సరఫరాలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 ఖరీఫ్ సీజన్లో 1,99,592.652 మెట్రిక్ట న్నుల బియ్యం సరఫరా చేసి 100% లక్ష్యం సాధించామని వెల్లడించారు. అలాగే రబీ సీజన్లో 2,97,915.128 మెట్రిక్ టన్నులు (94%) సరఫరా చేశామని తెలిపారు. 2025-26 ఖరీఫ్ 1,12,923.616 మెట్రిక్ టన్నలు సరఫరా చేశామన్నారు.