ASF: TRS పార్టీ జిల్లా ఇంఛార్జ్‌గా వాంకిడి మండల కేంద్రానికి చెందిన వినోద్ కరిమిల్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత శుక్రవారం ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని జిల్లా ఇంఛార్జ్ వినోద్ తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.