VZM: రాజాం మండలం బొద్దాం గ్రామంలోని అప్పయ్య బంద చెరువు ప్రస్తుతం జలధార పనులతో కళకళలాడుతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనుల్లో సుమారు 200 మంది వేతన కార్మికులు ప్రతిరోజూ పాల్గొంటూ చెరువుకు కొత్త రూపు తీసుకొస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత ఈ చెరువు ద్వారా సుమారు 25.6 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు.