NLR: వరికుంటపాడు మండలం గొల్లపల్లి గ్రామంలో ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం నుంచి కరెంట్ లేకపోవడంతో గ్రామస్తులు అంధకారంలో మగ్గుతున్నారు. మరమ్మతుల విషయంలో స్థానిక లైన్మెన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తూ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఇవాళ ఆందోళన చేపట్టారు.