PLD: అమరావతి మండలంలో శుక్రవారం వాతావరణం వేడిగా ఉంది. 42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయింది. వేడి వడగాల్పులు, ఈదురుగాలులు వీచాయి. ఉష్ణోగ్రత అధికంగా ఉండటంతో రోడ్లన్ని నిర్మానుషంగా దర్శనమిచ్చాయి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, ఉక్కపోతకు ఇబ్బందులకు గురయ్యారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు బయట సంచరించరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.