NLG: తరుగు పేరిట రైతులను నిలువు దోపిడీ చేయొద్దని PACS ఛైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన పర్యవేక్షణ లేదన్నారు.