SRPT: సూర్యాపేట మున్సిపల్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఈరోజు సూర్యాపేట పట్టణ అభివృద్ధిలో భాగంగా సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్పై చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ ఛైర్పర్సన్ నివేదితతో కలిసి ఆయన పరిశీలించారు.