MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీ వర్షానికి రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. నిల్వ ఉంచిన ధాన్య బస్తాలు కూడా వర్షపు నీటికి తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం నాణ్యత దెబ్బతింటే భారీ నష్టం వస్తుందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.