AP: అభినయ్ దర్శన్ కేసుపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో విచారణ జరుగుతోందన్నారు. కుట్ర కోణంపైనా విచారిస్తున్నామని తెలిపారు. దీని వెనుక ఎవరున్నారనేది అతి త్వరలో తెలుస్తుందని చెప్పారు. వారిని కస్టడీకి తీసుకొని విచారిస్తామని వెల్లడించారు. మరోవైపు అమాయక గిరిజనులను రెచ్చగొట్టేలా ప్రవర్తించాడని మండిపడ్డారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.