ప్రకాశం: గిద్దలూరులోని బ్రిటన్ స్ట్రీట్తో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.