RR: మొయినాబాద్ మున్సిపాలిటీ పెద్ద మంగళారం 16వ వార్డ్ కౌన్సిలర్ జంగం గీత వనజాక్షి సంజీవరావు ఆధ్వర్యంలో వార్డులో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ఆమె స్వయంగా రోడ్డు పక్కన ఉన్న చెత్తాచెదారాన్ని శుభ్రం చేయించారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధులు ప్రబలకుండా తడి, పొడి చెత్తను విడివిడిగా మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు.