TG: రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా సీఎం పట్టించుకోవటం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. ధాన్యం, జొన్నలు, పొద్దు తిరుగుడు పంటలు కొనకపోవటంతో రైతులు ఆవేదనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతుంటే బాధనిపిస్తోందని.. ఈ ప్రభుత్వానికి బుద్ది రావాలని కోరుకున్నారు.