HNK: నడికూడ మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నేడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు.