KDP: ప్రొద్దుటూరు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అవసరమైన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.