చిత్తూరు జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ ధనుంజయ్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఇప్పటికే TDP నేతలతో సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. శనివారం యాదమరిలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన పార్టీ మారొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ధనుంజయ్ రెడ్డి వర్గం వివరణ ఇస్తూ.. ఇది పూర్తిగా అవాస్తవం అని తేల్చింది.