SKLM: ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శ్రీకాకుళంలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ను నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలు వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు.