అన్నమయ్య: జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.