AKP: ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన 17 మంది విద్యార్థులను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సత్కరించారు. శుక్రవారం ఎలమంచిలి జడ్పీ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వారికి నగదు బహుమతులు అందజేశారు. ఈ పరీక్షల్లో బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని అభినందించారు.