W.G: ఆచంట బాలంవారి పాలెంలోని పి-4 భవనంలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసి రాహుల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మొత్తం 170 అర్జీలు స్వీకరించబడినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను పారదర్శకంగా పరిష్కరించి ప్రజలకు మరింత చేరువ కావాలనే ప్రభుత్వ లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలని సూచించారు.