VSP: సమ్మర్ కోచింగ్ కార్యక్రమంలో భాగంగా చింతలలోవలోని జేబీసీ బాక్సింగ్ క్లబ్‌ను 40వ వార్డు మాజీ కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు సందర్శించి క్రీడాకారులకు పోషకాహారం పంపిణీ చేశారు. జిల్లా స్థాయిలో పతకాలు సాధించిన బాక్సర్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే క్రీడల్లో ఉన్నత విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు.