TG: మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో కంటైనర్లో మంటలు చెలరేగాయి. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంటైనర్లో తరలిస్తున్న 10 కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.