NLG: త్రిపురారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సేవలను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి మరువలేనిదని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.