MBNR: మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామంలో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు అర్చన, కళ్యాణి మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రీయ ఎరువులు వాడాలని పంట మార్పిడి చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో AO సిద్ధార్థ్, రైతులు, అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.