సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ ‘జైలర్ 2’. తాజాగా ఈ మూవీ విడుదల తేదీపై సాలిడ్ బజ్ నెలకొంది. వినాయక చవితి కానుకగా 2026 సెప్టెంబర్ 10 లేదా 11న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ‘జైలర్’కి కొనసాగింపుగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.