CTR: పుంగనూరు పరిధిలోని తూర్పుమొగసాల, ముడిపాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మి నరసయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పనితీరుపై ఆరా తీశారు. మందుల గదిని, కాన్పుల గదిని, జనరల్ వార్డును తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందివ్వాలని సూచించారు.