AP: స్త్రీ నిధి ఉద్యోగులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వంలో మెరిట్ లేకుండా ఎంపికైన ఉద్యోగులపై కక్ష సాధింపులు ఉండవు. స్త్రీ నిధిలో ప్రతి ఉద్యోగం నోటిఫికేషన్, మెరిట్ ద్వారా భర్తీ చేశాం. 2025-26లో స్త్రీ నిధి ద్వారా రూ.5,856 కోట్ల రుణాలు పంపిణీ చేశాం. రుణాల మంజూరు పెరగడంతో 176 మేనేజర్ పోస్టుల భర్తీ చేశాం’ అని అన్నారు.