NLG: నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్-2026 వెబ్ కౌన్సిలింగ్ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ ఐలయ్య తెలిపారు. మే 27 నుంచి 31 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. మే 29 నుంచి జూన్ 3 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు నమోదు ఉంటాయని, జూన్ 6న సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు.