NLR: దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో శుక్రవారం పర్యటించనున్నారు. తాగు, సాగునీరు, మున్సిపాలిటీ మౌళిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం నియోజకవర్గంలోని మండలాల వారీగా పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలపై చర్చిస్తారు.