E.G: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం కొవ్వూరు నియోజకవర్గం గోంగూరలంకలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కలెక్టర్‌తో కలిసి పర్యటించనున్నారు. అనంతరం చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో నాగారమ్మ వారికి చీర సమర్పించనున్నారు. ఆ తర్వాత అక్కడ నూతన ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించి, స్థానికంగా నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.