ADB: పర్యాటక అభివృద్ధికి యువ ఇన్ఫ్లుయెన్సర్ల భాగస్వామ్యం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం స్థానిక TTDC హాల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డిజిటల్ టూరిజం ఛాలెంజ్ – రీల్స్ కాంపిటీషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన యువకులను కలెక్టర్ అభినందించారు.