WNP: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమాన్ని 22వ తేదీన నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయి ప్రజా పాలన కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోనే సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నామన్నారు.