KRNL: ఆదోని పట్టణంలోని శ్రీనివాస్ భవన్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఇవాళ మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా, క్యాంటీన్లో అందుబాటులో ఉన్న టిఫిన్ల నాణ్యత, రుచిని కమిషనర్ స్వయంగా రుచి చూశారు. ప్రజలకు అందించే ఆహారం రుచిగా, శుభ్రంగా, నాణ్యతతో ఉండాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.