NGKL: నాగర్కర్నూల్ మున్సిపాలిటీ 21వ వార్డులో కౌన్సిలర్ శంకర్ ఇంటి వద్ద తాచుపాము కనిపించడంతో స్నేక్ క్యాచర్ వంశీ దానిని సురక్షితంగా పట్టుకున్నారు. ప్రజలకు ప్రమాదం లేకుండా పామును జనసంచారం లేని ప్రాంతంలో విడిచిపెట్టారు. భూగర్భ వేడి కారణంగా పాములు బయటికి వస్తున్నాయని, వాటిని చంపకుండా సమాచారం ఇవ్వాలని వంశీ సూచించారు.